తెలంగాణ

సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లు.. పోలీసుల క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తాచ‌ర్య‌లు!

సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల, పొరుగు జిల్లా కరీంనగర్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిన క్రమంలో, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక నేతలు, నిరసనకారుల నుంచి ఎదురయ్యే ఆందోళనలను కట్టడి చేసేందుకు రెండు జిల్లాల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారు 1,600 మంది పోలీసు సిబ్బందిని మోహరించగా, కరీంనగర్ జిల్లా పరిధిలో మరో 550 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు.