తెలంగాణ
మిర్ ఆలం చెరువుకు సర్కార్ కొత్త హంగులు
Mir Alam Tank: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మిర్ ఆలం చెరువుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూపు, సరికొత్త హంగులు ఇవ్వాలని యోచన చేస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా ప్రముఖ పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మిర్ ఆలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పనుల పురోగతిని సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
