National
ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి భారీ నిరసన!
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణను కాంక్షిస్తూ ఇండియా కూటమి(INDIA) సోమవారం ఢిల్లీలో ఒక భారీ నిరసన మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, పలువురు రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపీలు కూడా ముఖ్యమంత్రితో పాటు భాగస్వామ్యం కానున్నారు.
