తెలంగాణ

నాకు మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా మీ వల్లే

Cm Revanth: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం అని చెప్పారు. పేదల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కార్యాలయం ఉపయోగపడాలని సూచించారు. సమస్యలతో వచ్చిన పేదలకు వెంటనే పరిష్కారం దొరకాలన్నారు.

ప్రజలకు సాయం చేయటం మన బాధ్యత

సాయం కోసం వచ్చిన వాళ్లను కుటుంబసభ్యుల్లా చూడాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ప్రజల సమస్యలే మన సమస్యలు అని చెప్పిన సీఎం రేవంత్.. సమస్యలతో వచ్చే ప్రజలకు సాయం చేయటం మన బాధ్యత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, దేశ ప్రధానమంత్రికైనా మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బాగా పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.