ఏపీ

రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఆకతాయిలు కారుతో ఢీకొట్టడంతో పీజీ వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అమరావతిలోని సచివాలయంలో ఈ ఘటనపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదానికి పాల్పడిన నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి అమానుషానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, వారికి తగిన రీతిలో శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు.