ఏపీ
cm chandrababu: ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంతో ముందుకు..సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అమరావతిని ప్రధాన వేదికగా చేసుకుని ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించింది. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన "స్వర్ణాంధ్ర-2047" ప్రధాన ఇతివృత్తం (Theme) ఆధారంగా వేడుకలు నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రత్యేక బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్‌లో వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
