International

ChinaEarthquake: 5.1 తీవ్రతతో చైనాలో భారీ భూకంపం!

దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సిచువాన్ ప్రాంతంలోని లాంగ్‌చాంగ్ (Longchang) నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఈ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ భూకంప పరిశోధన సంస్థలు వెల్లడించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైందని చైనా ఎర్త్‌క్వాక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) అధికారికంగా స్పష్టం చేసింది. లాంగ్‌చాంగ్ నగర పరిధిలో భూమికి దాదాపు 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని (Epicenter) గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.