తెలంగాణ
నేడు మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం
ఎట్టకేలకు రేవంత్ సర్కార్ మేల్కొంది. రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు. ఎల్ నినో పరిస్థితులపై చర్చించేందుకు నేడు మంత్రులతోనూ సమావేశం అవుతున్నారు.
