తెలంగాణ
'చీతా', 'టైగర్', 'రెడ్ హార్స్'.. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు!
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలోనే మరిన్ని కొత్త రకాల బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మార్కెట్లో ట్రెండ్‌కు తగినట్లుగా సరికొత్త రుచులు, విభిన్న నాణ్యతతో కూడిన మద్యం విక్రయాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వివిధ ప్రముఖ డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మద్యం మార్కెట్‌ను మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో దాదాపు 18కి పైగా కంపెనీలు సరికొత్తగా 121కొత్త మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖకు అధికారికంగా దరఖాస్తులు సమర్పించాయి.
