National
పిల్లలపై లైంగిక నేరాల కంటెంట్‌కు చెక్.. భారత అధికారులకు నేరుగా రిపోర్ట్ చేయనున్న గూగుల్!
ఆన్‌లైన్ ప్రపంచంలో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు టెక్ దిగ్గజం గూగుల్ కీలక అడుగు వేయనుంది. ఇలాంటి కంటెంట్‌కు సంబంధించిన కేసుల్లో సమాచారాన్ని భారత అధికారులకు నేరుగా అందించే విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.
