తెలంగాణ
‘రేవంత్ రెడ్డిపై కేంద్రం రాజకీయ కక్ష..’ యూఎస్ టూర్ రద్దుపై ఐఓసీ అమెరికా అభ్యంతరం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా అనుమతి నిరాకరించింది. విదేశాంగ శాఖ (MEA) తీసుకున్న ఈ నిర్ణయంతో సీఎం పర్యటన పూర్తిగా రద్దయింది. ముఖ్యమంత్రి హోదాకు, ఆ పర్యటన లక్ష్యానికి తగిన స్థాయిలో అధికారిక కార్యక్రమాలు లేవని పేర్కొంటూ కేంద్రం ఈ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై 'ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్' (IOC) అమెరికా విభాగం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి, రాజకీయ కక్ష సాధింపు చర్యకు నిదర్శనమని ఆరోపించింది.
