Car Rash Driving: దిల్‌సుఖ్‌ నగర్ రోడ్లపై ఓవర్ స్పీడ్‌తో కారు హల్చల్.. నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ పేరు

Car Rash Driving: హైదరాబాద్ దిల్‌సుఖ్‌ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఉన్న ఓ కారు.. ఓవర్ స్పీడ్ తో హల్ చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక అద్దంపై సీఎం రేవంత్ ఫోటో రేడియం స్టిక్కర్ ఉంది. ఆ ఫోటోకి కాస్త పక్కగానే అడ్వకేట్ సింబల్ స్టిక్కర్ కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ పేరును కొందరు పోకిరీలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యధేచ్చగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రద్దీ రోడ్డులో స్పీడ్ గా కారు తోలుతూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ మెయిన్ రోడ్ పై 2 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ కారు నడుపుతున్న పోకిరీల డేంజర్ డ్రైవింగ్ బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు.