National
ఢిల్లీలో గ్రీన్ టపాసుల ముసుగులో దందా.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో బాణసంచా విక్రయాలపై విధించిన ఆంక్షలు తుంగలో తొక్కడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ అనుకూల 'గ్రీన్ క్రాకర్స్' (Green Crackers) విక్రయాల ముసుగులో నిషేధిత సాధారణ, అత్యంత కాలుష్యకారక టపాసులను బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం (నవంబర్ 3, 2026) తీవ్రంగా పరిగణించింది.
