International
BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!
భారతదేశం మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ సమావేశానికి వేదిక కాబోతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 'బ్రిక్స్ (BRICS) 2026' సదస్సుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సును దిగ్విజయం చేసేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో ఏకకాలంలో పర్యటించి ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వారి ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ ప్రతినిధి బృందాలతో ఢిల్లీకి వచ్చేందుకు సానుకూలంగా స్పందించారు.
