తెలంగాణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డికి అరెస్ట్ వారెంట్!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ హైదరాబాద్ మున్సిపల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 'మెసర్స్ ఇంటెల్లిడెక్స్' కంపెనీకి రోహిత్ రెడ్డి జారీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెక్ వరుసగా మూడు సార్లు బౌన్స్ కావడంతో సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన కోర్టు, బాధితుల తరఫు వాదనలతో ఏకీభవించింది. ఈ వ్యవహారంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఆయనపై మోపబడిన నేరం రుజువైందని న్యాయమూర్తి ఖుష్బూ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. విచారణ ముగిసి తీర్పు వెలువరించే సమయానికి నిందితుడైన మాజీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.