క్రైమ్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం..

Bollaram: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ మల్లేష్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇంచార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషు.. ఆయుధాల చోరీలో మల్లేష్‌కు సహకరించినట్లు విచారణలో తేలింది. అంతేకాదు మల్లేష్‌తో వారికి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వెపన్స్‌ గోడౌన్‌ కీపర్లు వినోద్‌, శేషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.