తెలంగాణ

TG:తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జిగా బీఎం సందీప్

TG: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం అనూహ్య మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను మారుస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్ స్థానంలో, రాష్ట్ర కాంగ్రెస్ కొత్త బాస్‌గా బి.ఎం.సందీప్‌ను నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అధిష్ఠానం స్పష్టం చేసింది.తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను బి.ఎం.సందీప్ తక్షణమే స్వీకరించనున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.