తెలంగాణ
BJP Telangana: గోషామహల్ కోటలో కమలం 'ఆపరేషన్'.. రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి?
BJP Telangana: వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గద్దెనెక్కాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు క్షేత్రస్థాయిలో 'ఆపరేషన్ ప్రక్షాళన' మొదలుపెట్టింది. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న నేతలు, రాజీనామా చేసిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన గోషామహల్ నియోజకవర్గంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టడం, ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనతో అక్కడి రాజకీయ లెక్కలన్నీ ఒక్కసారిగా తేలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
