సినిమా

Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?

Bigg Boss : తెలుగు బుల్లితెరపై సంచలనాల రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు, ఓట్లు గుద్దుతారు, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌తో యుద్ధాలే చేస్తారు. కానీ, మూడు నెలల హడావుడి ముగిసి, చేతికి ట్రోఫీ రాగానే ఆ విజేతల భవిష్యత్ ఏమవుతోంది? ఇప్పటి వరకు పూర్తయిన తొమ్మిది సీజన్ల రికార్డులను నిశితంగా పరిశీలిస్తే ఒక కఠినమైన నిజం స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన వారెవరికీ వెండితెరపై నిలదొక్కుకునే అదృష్టం దక్కలేదు. చిత్రంగా, షోలో టైటిల్ కొట్టకుండా బయటకు వచ్చిన నటుడు శివాజీ సాధించిన రీ ఎంట్రీ, తొమ్మిది సీజన్ల విన్నర్లలో ఒక్కరికి కూడా సాధ్యం కాకపోవడమే ఇప్పుడు అసలైన హాట్ టాపిక్.మిగిలిన విజేతల విషయంలో బిగ్ బాస్ తెచ్చిన ఫేమ్ కేవలం నీటిబుడగలా ఎందుకు మారిపోయింది? షో ముగిసిన వెంటనే వచ్చే తాత్కాలిక క్రేజ్‌ను ఎలా మార్కెట్ చేసుకోవాలో చాలామందికి సరైన ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. కొందరు తమ వ్యక్తిగత వివాదాలు, తొందరపాటు నిర్ణయాలతో క్రేజ్ తగ్గించుకోగా, మరికొందరు తమకు నటన రాకపోయినా ప్రధాన పాత్రలే కావాలనే భ్రమల్లో ఉండి చేతులు కాల్చుకున్నారు.