క్రైమ్
రాప్తాడు దాడి కేసులో బిగ్ అప్డేట్.. ఉన్మాది హేమంత్ కుడి కాలు తొలగింపు!
ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దారుణంగా దాడి చేసిన కేసులో విచారణాధికారులు, వైద్యులు సంచలన బిగ్ అప్డేట్ వెల్లడించారు. పారిపోయే క్రమంలో పోలీసులు జరిపిన ఆత్మరక్షణ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ కుడి కాలిని శస్త్రచికిత్స చేసి పూర్తిగా తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన సమయంలో పోలీసులపై కత్తితో దాడికి తెగబడటంతో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
