National

రాహుల్‌ గాంధీకి బిగ్ రిలీఫ్.. సావర్కర్‌ వ్యాఖ్యల కేసు కొట్టివేత!

స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుతో పాటు దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను కూడా సుప్రీంకోర్టు శుక్రవారం పూర్తిగా రద్దు చేసింది. చట్టపరంగా ఈ తరహా కేసును ముందుకు తీసుకెళ్లడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు పొందలేదని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రధానంగా స్పష్టం చేసింది.