క్రీడలు
BCCI: గంభీర్ కోచింగ్‌పై బీసీసీఐ క్లారిటీ.. వైఫల్యాలు ఎదురైనా హెడ్ కోచ్‌గా కొనసాగింపు!
టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పదవికి ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని, ఆయన తన పదవిలో సురక్షితంగానే కొనసాగుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, అంతకుముందు స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో ఘోర పరాజయాలను చవిచూడటంతో గంభీర్ కోచింగ్ శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనను వెంటనే కోచ్ బాధ్యతల నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నా బోర్డు మాత్రం పూర్తిగా ఆయన వెంటే నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
