క్రీడలు

జపాన్ మాస్టర్స్ పోరు.. భారత షట్లర్ లక్ష్యసేన్ చారిత్రాత్మక విజయం!

 భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ గడ్డపై అద్భుత ప్రదర్శనతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. జపాన్ లోని కుమామోటోలో జరిగిన ప్రతిష్టాత్మక 'జపాన్ మాస్టర్స్-2026' సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష సింగిల్స్ ఆటగాడిగా లక్ష్యసేన్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో స్థానిక జపాన్ ఆటగాడు కోకి వతనాబేపై 13-21, 21-18, 21-14 తేడాతో అద్భుతమైన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాడు.