తెలంగాణ
బాలయ్య పెద్ద మనసు.. సగం ఇంటి స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగింత!
హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, ప్రయాణికులకు సులభతరమైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ప్రఖ్యాత కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న రహదారుల విస్తరణ పనులకు టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వంతుగా గొప్ప సహకారాన్ని అందించారు. నగర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన తన స్వగృహానికి సంబంధించిన విలువైన స్థలాన్ని స్వచ్ఛందంగా అందజేశారు.
