చిత్రం లేదు
క్రీడలుబంగ్లా చేతిలో ఆసిస్ ఘోర పరాజయం.. !
క్రికెట్ ప్రపంచంలో బంగ్లాదేశ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో పటిష్టమైన ఆసీస్ జట్టును మట్టికరిపించింది. 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆతిథ్య జట్టుకు ఊహించని షాక్ ఇచ్చి తమ టెస్టు చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే కట్టడి చేసిన బంగ్లాదేశ్, తన మొదటి ఇన్నింగ్స్లో 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.
