క్రైమ్
అల్వాల్లో దారుణం.. బాలికపై ఎనిమిది మంది లైంగికదాడి!
హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే భయంకరమైన ఘాతుకం వెలుగుచూసింది. 16 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు వరుసగా లైంగిక దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, మహిళా మండళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
