మహిళలపై దౌర్జన్యం.. నేడు గవర్నర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు రాష్ట్ర గవర్నర్ శివపత్రాప్ శుక్లాతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడంతో లోక్ భవన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతలో గవర్నర్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించనున్నట్టు సమాచారం. వారి మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వరుస పరిణామాలను గవర్నర్ దృష్టికి గులాబీ పార్టీ నేతలు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. పోలీసుల వ్యవహారశైలిపై సమగ్రంగా వివరించి వారిపై చర్యలకు ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా గవర్నర్ను కోరనున్నట్టు తెలుస్తోంది.
