తెలంగాణ

గిగ్ వర్కర్లకు భరోసా.. బీమా పథకాన్ని  ప్రారంభించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి!

 రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని జయభేరీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి 'తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం' విధివిధానాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు మాదాపూర్ శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు వేలాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లతో కలిసి నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్సాహంగా పాల్గొన్నారు.