క్రీడలు
AsianGames2026: చైనాను చిత్తు చేసి.. మరో స్వర్ణం కైవసం చేసుకున్న భారత్!
ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు తమ సత్తా చాటారు. చైనాపై మొదటి నుంచి అద్భుతమైన ప్రతిభను కొనసాగిస్తూ దేశానికి మరో చిరస్మరణీయ స్వర్ణ పతకాన్ని అందించారు. బుధవారం నిర్వహించిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సంచలన ప్రదర్శనతో చైనా జట్టును మట్టికరిపించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణులు, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆది నుంచి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతలుగా నిలిచారు. ఈ చారిత్రాత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన తనిపర్తి చికిత, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్ అద్భుతమైన సమన్వయంతో విల్లు గురిపెట్టారు.
