తెలంగాణ
AsianGames: ఆసియా క్రీడల్లో భారత్ బోణీ.. షూటింగ్‌లో రజతం!
ఆసియా క్రీడల ప్రారంభంలోనే భారత క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ పతకాల ఖాతాను తెరిచారు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటింగ్ బృందం రజత పతకాన్ని చేజిక్కించుకుని దేశానికి తొలి మెడల్‌ను అందించింది. ఇలవేనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌లతో కూడిన భారత త్రయం అత్యుత్తమ ప్రదర్శనతో చైనా తర్వాతి స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) విభాగంలో భారత అథ్లెట్ సుచిక సరికొత్త చరిత్ర సృష్టించింది.
