క్రీడలు

Boxing Medals: రింగ్‌లో భారత్‌ పంచ్ పవర్.. 3 మెడల్స్ ఖాయం చేసుకున్న బాక్సర్లు!

Boxing Medals: ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్ దళం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ పంచ్‌ల వర్షం కురిపించిన భారత బాక్సర్లు ఒకే రోజు ఏకంగా మూడు పతకాలను భారత్ ఖాతాలో లాక్ చేసి సంచలనం సృష్టించారు. 18వ ఆసియా క్రీడల ఎనిమిదో రోజున రింగ్‌లోకి దిగిన మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి దేశానికి కనీసం మూడు కాంస్య పతకాలను ఖాయం చేశారు.నగోయా వేదికగా సాగుతున్న పోటీల్లో ఆదివారం భారత బాక్సర్లు రెచ్చిపోయారు. పురుషుల 80 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత అంకుశ్ పంగల్ స్టార్టింగ్ నుంచే పంజా విసిరాడు. తజకిస్థాన్‌కు చెందిన నెక్రుజ్ సలొమోవ్‌పై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశాడు.