క్రీడలు
AsianGames2026: భారత్‌కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతంతో మెరిసిన భారత షూటర్లు!
జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల ఆరో రోజున భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో దేశానికి డబుల్ ధమాకా అందించారు. షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు లఘు వ్యవధిలోనే ఒక స్వర్ణం, ఒక రజత పతకాన్ని సాధించి పతకాల పంట పండించారు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో సురుచి, కమల్‌జీత్ లతో కూడిన భారత జోడీ సంచలన ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఈ జోడీ ఆసియా రికార్డును సమం చేయడం విశేషం.
