ఏపీ
వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!
ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం అల్పపీడనం రూపుదిద్దుకుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరప్రాంతం వెంబడి గంటకు 40నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు.
