ఏపీ

AP: ఎంపీటీసీ, జడ్పీటీసీ సమరానికి సై.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, గడువు ముగిసిన మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం (MPTC), జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం (ZPTC) స్థానాలకు ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది. నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఉదయం 11:00 గంటల నుంచి సంబంధిత మండల ప్రజా పరిషత్ (MPP), జిల్లా పరిషత్ (ZP) కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు.