ఏపీ

AP Local Elections: బ్యాలెట్ బాక్సుల్లో పల్లె తీర్పు.. నవంబర్ 7పై సర్వత్రా ఉత్కంఠ!

AP Local Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరం ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారం ఎవరిదో తేల్చే కీలకమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ విజయవంతంగా ముగియగా, ఇప్పుడు అందరి కళ్లూ నవంబర్ 7న జరగనున్న కౌంటింగ్‌పైనే ఉన్నాయి. పల్లె ఓటరు నాడి ఎటువైపు ఉందో తేలనుండటంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30,994 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే పల్లె ఓటర్లు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 67.24% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారిని కూడా అనుమతించడంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.