క్రైమ్
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఉదంతంపై ఏపీ హైకోర్టు సీరియస్: డీజీపీకి కీలక ఆదేశాలు!
కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. చిన్నారి ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టేందుకు రాష్ట్ర పోలీసు శాఖ మరింత చురుగ్గా, పకడ్బందీగా గాలింపు చర్యలు చేపట్టాలని డీజీపీ హరీశ్ కుమార్ను స్పష్టంగా ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తప్పిపోయిన పిల్లల కేసుల్లో పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
