తెలంగాణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

 బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తీవ్రతరమై నవంబర్ 13 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు యానాం ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్, అమరావతి కేంద్రాలు స్పష్టం చేశాయి.