National

ఇస్రో ఖాతాలో మరో చారిత్రక ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎన్‌వీఎస్-03!

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దేశీయ అంతరిక్ష రంగంలో మరొక అద్భుతమైన మైలురాయిని దాటింది. భారతదేశానికి సొంతంగా ఉన్న ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' (NavIC) సేవలను మరింత సమర్థవంతంగా, కచ్చితత్వంతో అందించే లక్ష్యంతో చేపట్టిన 'ఎన్‌వీఎస్-03' (NVS-03) ఉపగ్రహ ప్రయోగం పూర్తి విజయవంతమైంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం రాత్రి 11:51గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.