National
Anna Hazare: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!
నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంతో ఢిల్లీలో నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను బలవంతంగా అణచివేయడం సరికాదని, కేవలం సంప్రదింపులు, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్లో ఆదివారం(నేడు) జరిగిన ఓ కార్యక్రమంలో అన్నా హజారే మాట్లాడారు.
