ఏపీ

Andhra Pradesh: లోకల్‌ ఫైట్‌లో జనసేనకు కొత్త చిక్కులు.. పవన్‌ ముందున్న డబుల్‌ ఛాలెంజ్‌ ఇదే!!..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూటమి ప్రయాణం ఇప్పుడు మరో కీలక దశలోకి వెళ్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కలిసి సాధించిన ఫలితాల తర్వాత.. అదే సమీకరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పనిచేస్తుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ముఖ్యంగా జనసేనకు పన్నెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో తనకు ఉన్న బలాన్ని రాజకీయ సీట్లుగా మార్చుకోగలదా? అనేది సవాల్ గా మారింది..

2014లో జనసేన ఆవిర్భవించినప్పుడు పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం కంటే పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత ప్రభావం, అభిమానుల మద్దతు ప్రధాన బలంగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో, 2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి తీవ్రమైన కష్టకాలంగా మారింది. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయి, జనసేన చరిత్రలోనే అది ఒక క్లిష్టమైన పరీక్షా సమయంగా నిలిచింది.