సినిమా

Ananya Raj: 27ఏళ్లకే నటి మృతి.. నెలరోజులకు వెలుగులోకి..!

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన యువ నటి, ప్రముఖ మోడల్ అనన్య రాజ్(27) అకాల మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె జులై 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలోనే కన్నుమూశారు. అయితే, ఈ విషాద వార్తను కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత (ఆగస్టు 16న) సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. అనన్య రాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె కుటుంబ సభ్యులు ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ ప్రకటనను పోస్ట్ చేశారు.