వైరల్ న్యూస్
ఉద్యోగులందరికీ ఊహించని సర్ప్రైజ్.. యూఏఈ సంస్థ సంచలనం!
ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడంలో కొన్ని సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా పనిచేస్తున్న ప్రముఖ ‘వరల్డ్ స్టార్ హోల్డింగ్’ సంస్థ తన మహిళా ఉద్యోగులకు అత్యంత ఖరీదైన 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ఫోన్లను బహుమతిగా అందించి వార్తల్లో నిలిచింది. కేరళకు చెందిన ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.
