National
ఆల్ టైమ్ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్..!
విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అతితక్కువ కాలంలోనే ఊహించని రీతిలో పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా అవతరించింది. వార్షికంగా ఏకంగా రూ.2,493 కోట్ల ఆల్ టైమ్ రికార్డు రాబడిని ఆర్జించి ఈ జోన్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుందని కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే రవాణా, మౌలిక వసతుల కల్పన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని, ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేసింది.
