ఏపీ

నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ ఖాళీలు వెనువెంటనే భర్తీ చేస్తానని ప్రకటించిన విధంగానే కూటమి సర్కార్ వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నది. మొన్నటివరకు డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలు ప్రకటించిన ఏపీ సర్కార్ .. తాజాగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్ర పరిపాలనా విభాగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌‌‌ను (ఏపీపీఎస్‌సీ) అధికారికంగా విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 విభాగాల్లో కలిపి 166 గ్రూప్-1 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా అక్టోబర్ 06 నుంచి అక్టోబర్ 27వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని కమిషన్ కోరింది.