చిత్రం లేదు
తెలంగాణబంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఉపరితల ఆవర్తనం తీవ్రమై అల్పపీడనంగా మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రానున్న కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రెండు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
