తెలంగాణ
కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏఐఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేరిట మూడు కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసింది.తాజాగా దీనిపై అక్భరుద్దీన్ ఓవైసీ పలు ప్రశ్నలు సంధించారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం ఎందుకు విభజించిందని, అందుకు గల అసలు కారణం ఏంటో చెప్పలేదని శాసనసభ వేదికగా ప్రశ్నించారు. ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉందని, వేతనాలు సరిపోవట్లేదు అని అధికారులు అంటున్నారని చెప్పారు. అలాంటప్పుడు మరి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాల్సిన అవసరం ఏముందని అడిగారు.
