International
AI Fake report: ఏఐ తప్పుడు రిపోర్ట్.. అమెరికా-చైనా మధ్య తప్పిన యుద్ధ గండం!
కృత్రిమ మేధ (AI) అందించిన తప్పుడు సమాచారం వల్ల ప్రపంచ రక్షణ రంగంలో తీవ్ర కలకలం రేగింది. ఏఐ చాట్‌బాట్ చేసిన ఊహించని పొరపాటు కారణంగా అమెరికా, చైనాల మధ్య దాదాపు సైనిక ఘర్షణ లేదా యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి తలెత్తింది. ఈ విస్మయపరిచే ఘటనకు సంబంధించిన కథనాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించి అందిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది తొలినాళ్లలో మధ్యప్రాచ్య సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక చైనా సరుకు రవాణా నౌకలో అణ్వాయుధాలకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన పరికరాలు ఉన్నాయంటూ అమెరికా సైనిక నిఘా విభాగానికి ఒక నివేదిక అందింది.
