వ్యాపారం
AdaniGroup: అదానీ గ్రూప్‌నకు ఊరట.. రూ.1.5 కోట్లతో సెటిల్‌మెంట్!
అమెరికా హెడ్జ్‌ఫండ్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆధారంగా నమోదైన కేసుల విచారణ నుంచి అదానీ గ్రూప్‌కు గణనీయమైన ఉపశమనం లభించింది. సంబంధిత పార్టీల లావాదేవీలు (RPT), కార్పొరేట్ గవర్నెన్స్ మార్గదర్శకాల అతిక్రమణపై మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) చేపట్టిన న్యాయపరమైన చర్యలను ఐదు అదానీ గ్రూప్ కంపెనీలు రూ.1.5 కోట్ల మొత్తం చెల్లించి సెటిల్ చేసుకున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం ఎలాంటి తప్పునూ ఒప్పుకోకుండా, లేదా తిరస్కరించకుండా ప్రక్రియను ముగించే 'సెటిల్‌మెంట్ మెకానిజం' ద్వారా ఈ కేసుకు స్వస్తి పలికారు.
