సినిమా

హీరో విశాల్‌‌కు షూటింగ్‌లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు!

 చిత్రదర్శకుడు సుందర్.సి సారథ్యంలో రూపొందుతున్న ‘పురుషన్’ ప్రాజెక్ట్ కోసం గోవా తీరప్రాంతాల్లో కొన్ని రోజులుగా కీలక దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. విదేశీ స్టంట్ నిపుణుల నేతృత్వంలో ఓ ఉత్కంఠభరితమైన ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. రిస్క్‌తో కూడుకున్న స్టంట్స్‌ను ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా పూర్తిచేయాలనే ఆలోచనతో విశాల్ ఈ షాట్‌లో పాల్గొన్నారు. అయితే టైమింగ్ తప్పడం వల్ల ఆయన తీవ్రంగా గాయపడ్డారు.