క్రైమ్

Accident: ప్రాణం తీసిన అతివేగం.. విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని విద్యార్థి మృతి!

సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక కాలేజీ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన లాల్‌బజార్ నుంచి డైరీ ఫామ్ వెళ్లే ప్రధాన రహదారిపై జరిగింది. లభించిన సమాచారం ప్రకారం.. ఇద్దరు కాలేజీ విద్యార్థులు అపాచీ బైక్‌పై లాల్‌బజార్ వైపు నుంచి డైరీ ఫామ్ దిశగా వెళ్తున్నారు.